Friday, 27 November 2015

అక్కడ మద్యం నిషేధం .....



 బీహార్ సీఎం నితీశ్‌కుమార్ తన ఎన్నికల హామీల అమలుకు చర్యలు చేపట్టారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం -ఎక్సైజ్ డే వేడుకల్లో సీఎం నితీశ్ ప్రకటన అమలు చేయనున్నట్లు గురువారం ఎక్సైజ్ డే కార్యక్రమంలో చెప్పారు. మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400 కోట్ల ఆదాయం వస్తున్నా, పేదలు, మహిళల ప్రయోజనాల రీత్యా మద్యనిషేధం అమలు చేయాలని నిర్ణయించామన్నారు. తదనుగుణంగా కొత్త మద్యవిధానం అమలులోకి తేవాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంజనీకుమార్ సింగ్, ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి కేకే పాఠక్‌లను ఆదేశించారు. మద్యపానం వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ముందు ఉన్న స్వచ్ఛంద సంస్థలకు అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. నితీశ్‌ను చంపేస్తా: టీవీ చానెల్‌కు బెదిరింపు ఎస్సెమ్మెస్ సీఎం నితీశ్‌కుమార్‌ను బాంబులతో చంపేస్తామని పేర్కొంటూ ఓ వ్యక్తి గురువారం పాట్నాలోని కాశిష్ అనే ప్రైవేట్ టీవీ చానెల్‌కు మొబైల్ ఫోన్ నుంచి ఎస్సెమ్మెస్ పంపాడు. దీంతో సీఎం నితీశ్‌కుమార్‌కు భద్రతను పెంచారు .

No comments:

Post a Comment