Friday, 27 November 2015

జుబ్లిహిల్ల్స్ సాక్షిగా అక్రమంగా తన వర్గం వారికీ దోచిపెట్టిన బాబు..!!!

తెలంగాణ రాష్ట్రం లో కొంతమంది రాజకీయ నాయకుల మాటలు ,విమర్శలు చూస్తుంటే వారికీ చింత సచ్చిన పులుపు చావలేదు అన్న సామెత గుర్తుకు వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి . ఎందుకంటే గతం లో ఉమ్మడి రాష్ట్రం లో దాదాపు తొమ్మిది ఏండ్లు అధికారంలో ఉన్న పసుపు పార్టీ నేతలు అప్పుడు ప్రజలు ,రైతులు గుర్తుకు రాకుండా ఎన్నో ఉద్యమాలు ,ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వం లో తెరాస పార్టీ అధికారం లోకి వచ్చి కనీసం రెండి ఏండ్లు అయిన కాకుండా తెలంగాణ రాష్ట్రం అప్పులలో కూరుకుపోయింది ,తెలంగాణ రాష్ట్ర మంత్రులు అవినీతి అక్రమాలకి పాల్పడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని ఉదయం లేచిన దగ్గర నుండి తమ ఆస్థాన మీడియా లో ఒకటే పత్రిక ప్రకటనలు ,విమర్శలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అటు రాజకీయ నేతలకి మస్తు కామిడి అందిస్తున్నారు అందరు .

ఉమ్మడి రాష్ట్రం లో అధికారం లో ఉన్న పసుపు పార్టీ తము అధికారం లో ఉన్న తొమ్మిది ఏండ్లు అభివృద్ధి పేరు తో తెలంగాణ రాష్ట్రాన్ని ,ముఖ్యంగా హైదరబాద్ నగరం చుట్టూ ఉన్న భూములని ఆక్రమించుకున్నారు . పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి  ఉదయం లేస్తే తను చెప్పే మాట హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటం లో నిలిపాను అని. కానీ అయన హైటెక్ పేరు తో కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములని తన సామజిక వర్గానికి ముఖ్యంగా తన బినామిలకి దోచి పెట్టాడు అన్నది జగమెరిగిన సత్యం . హైటెక్ సిటీ కి అతి సమీపాన ఉన్న ప్రాంతాలలో ప్రముఖ సినిమా ఫైనాసియర్,ప్రముఖ నిర్మాత అయిన ఒక వ్యక్తికీ కొన్ని వందల కోట్లు విలువ చేసే భూమిని సదర్ వ్యక్తికీ కట్టబెట్టి తనకి అందినకాడికి ఆయనకి కట్టబెట్టారు . ఇప్పుడు అయన కొన్ని భారి సినిమాలకి పైసలు పెట్టె స్థాయికి ఎదగాడు . అంతే కాకుండా సదర్ వ్యక్తి ఆస్తులు కూడా కొన్ని వేల కోట్లు ఉంటాయి అని ఫిలిం నగర్ వర్గాల సమాచారం . త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ నేతలకి ఆయనే డబ్బులు అందజేయనున్నాడని సమాచారం …

No comments:

Post a Comment